కోడంబాక్కం న్యూస్: తమిళ హీరో విశాల్ ప్రేమ వ్యవహారాలు కోలీవుడ్‍లో ఒకప్పుడు హాట్ టాపిక్‍గా ఉండేవి. అలాగే గతంలో హైదరాబాద్‍కు చెందిన అమ్మాయితో విశాల్‍కు ఎంగేజ్‍మెంట్ జరగగా.. అది కూడా క్యాన్సల్ అయింది. కొందరు హీరోయిన్లతో విశాల్ డేటింగ్ చేసినట్టు రూమర్లు చాలాసార్లు వచ్చాయి. అయితే, ప్రతీసారి వాటిని ఖండిస్తూ వచ్చారు విశాల్. ఇప్పటికీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా ఉన్నారు. అయితే, తాజాగా న్యూయార్క్ వీధిలో ఓ అమ్మాయితో విశాల్ కనిపించారు.

న్యూయార్క్‌లో ఓ అమ్మాయి భుజంపై చేయి వేసుకొని రోడ్డుపై నడుస్తూ కనిపించారు విశాల్. అతడి అక్కడ కొందరు ఆయను గుర్తుపట్టి విశాల్ అని పిలవగానే.. అమ్మాయితో కలిసి విశాల్ పరుగులు పెట్టారు. కెమెరాలు కనిపించగానే షర్టుతో తన ముఖాన్ని కవర్ చేసుకున్నారు. అమ్మాయి ముఖం కూడా కనిపించకుండా జాగ్రత్త పడ్డారు.

న్యూయార్క్ వీధుల్లో అమ్మాయితో విశాల్ పరుగు పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె ఎవరు అంటూ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విశాల్ మళ్లీ రిలేషన్‍షిప్‍లో ఉన్నారని కొందరు కామెంట్లు చేస్తున్నారు. రకరకాలుగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

అయితే, తదుపరి సినిమా ప్రమోషన్ కోసమే విశాల్ ఇలా చేశారని మరికొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. విశాల్ రియాక్ట్ అయిన తీరును చూస్తే ఇదంతా కావాలనే చేసినట్టుగా ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంపై త్వరలోనే క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.