విల్లివాకం న్యూస్: పొన్నేరి వేలమ్మాల్ ఎడ్యుకేషన్ పార్క్ లో ఇంటర్ స్కూల్ (చైమింగ్ బెల్స్) క్రిస్మస్ క్యారల్ కాంటెస్ట్ 2023 గురువారం జరిగింది. ఇందులో చెన్నై, తిరువళ్లూరు, చెంగల్పట్టు, కళ్ళకురిచ్చి, సేలం ఇతర జిల్లాలు, పాండిచ్చేరి సహా 30కి పైగా పాఠశాలల నుంచి 1000 మందికి పైగా ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వేలమ్మాల్ ఎడ్యుకేషన్ గ్రూప్ డైరెక్టర్ ఎంవిఎం శశి కుమార్ అధ్యక్షత వహించారు. పోటీల్లో ఆసక్తితో పాల్గొన్న విద్యార్థులను, ఉపాధ్యాయులందరినీ అభినందించారు. ఎడ్యుకేషన్ డైరెక్టర్ గీతాంజలి పాల్గొన్నారు. వేలమ్మాల్ ఎడ్యుకేషన్ గ్రూప్ తరపున 8 ఏళ్లగా క్రిస్మస్ క్యారల్ పోటీలు జరుగుతున్నాయి.

విద్యార్థులు ఆటలు, పాటలు, సంగీత వాయిద్యాల తో ప్రతిభను ప్రదర్శించే విధంగా కార్యక్రమాలు జరిగాయి. ఇందులో విద్యార్థులంతా ఆసక్తితో పాల్గొన్నారు. వారిలో ఆసక్తిని మరింతగా పెంపొందించేందుకు అనేక బహుమతులు, ప్రశంసా పత్రాలు, రోలింగ్ షీల్డ్ లు అందజేశారు. ప్రత్యేక అతిథిగా పాల్గొన్న చెన్నై స్టెల్లా మేరీస్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ఆర్ స్టెల్లా మేరీస్ విజేతలకు బహుమతులు పంచిపెట్టారు. ఆమె మాట్లాడుతూ వేలమ్మాల్ ఎడ్యుకేషన్ గ్రూప్ విద్యార్థులలో ప్రతిభా పాటవాలను పెంపొందించేందుకు నిర్వహిస్తున్న ఈ పోటీలో పాల్గొనడమే మంచి అవకాశం అన్నారు. ప్రతిభను కనుపరిచిన విద్యార్థుల సాధన పయనం కొనసాగాలని ఆకాంక్షించారు.