3వ రోజు రైతుల సమ్మె: నేడు కేంద్ర ప్రభుత్వంతో మళ్లీ చర్చలు

ఢిల్లీ ప్రతినిధి :పంటలకు కనీస మూల ధర, వ్యవసాయ రుణాలు మాఫీ, రైతులకు పెన్షన్, రైతులపై పెట్టిన కేసుల రద్దు, విద్యుత్ సవరణ బిల్లు రద్దు వంటి పలు డిమాండ్లతో రైతు సంఘాలు రాజధాని ఢిల్లీ సరిహద్దులను ముట్టడించాయి. రైతుల నిరసనతో ఢిల్లీతోపాటు పొరుగు రాష్ట్రాల్లోనూ ఉత్కంఠ నెలకొంది.ఇప్పటికే ఆందోళన చేస్తున్న రైతులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపగా, ఈరోజు (గురువారం) సాయంత్రం 5 గంటలకు మరోసారి చర్చలు జరపనుంది.
ఈ చర్చల్లో కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, పీయూష్ గోయల్, నిత్యానంద్ రాయ్ పాల్గొంటారు. వివిధ రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొంటారని సంయుక్త కిసాన్ మోర్చా కార్యవర్గం విలేకరులకు తెలిపారు.