అరుదైన వ్యక్తికి అరుదైన నివాళులు

విల్లివాకం న్యూస్: జెయస్ రెడ్డిగా చిరపరిచితుడైన జక్కా శ్రీనివాసులు రెడ్డి ఈనెల 1వ తేదీన బెంగుళూరులో
తుది శ్వాస విడిచారు. వారి దశదిశ కర్మ బుధవారం బెంగుళూరులోని ఇందిరానగర్ క్లబ్ నందు జరిగింది. మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడుతో పాటు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి, మాజీ నెల్లూరు శాసనసభ్యుడు జె.కె.రెడ్డి, బెంగుళూరు తెలుగు సంఘం అధ్యక్షుడు రాధాకృష్ణ రాజు, వై.ఎస్.ఆర్ పార్టీకి చెందిన భక్తవచ్చల రెడ్డి, భాస్కర్ రెడ్డి, వెంకట్ లతో పాటు నెల్లూరు జిల్లాకు చెందిన రాజకీయ నాయకులు, బెంగుళూర్ కు చెందిన వివిధ రంగ ప్రముఖులు పాల్గొని నివాళులు అర్పించారు. వచ్చిన అతిథులు జె.ఎస్.రెడ్డి కుమారుడు భక్తవత్సల రెడ్డి, కుమార్తె ఇందిర లకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
జెఎస్ రెడ్డి దశదిశ కర్మ కార్యక్రమంలో పాల్గొన్న సినీ నిర్మాత దర్శకుడు, తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి జెఎస్ రెడ్డి తను పుట్టిన గడ్డకు చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ జెఎస్ రెడ్డి అరుదైన వ్యక్తిత్వం కలిగిన వారని, వృత్తి రీత్యా కాంట్రాక్టరని, స్వశక్తితో అంచెలు అంచెలుగా ఎదిగారన్నారు. కాంట్రాక్టర్ గా ఆయన ప్రతిభ అపారమని, గుజరాత్ లో నర్మదా నది కాలువల నిర్మాణంలో ఆయన ప్రదర్శించిన ప్రజ్ణకు ఏంతగానో సంతోషించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జెఎస్ రెడ్డిని ప్రభుత్వం తరపున సత్కరించారని,
కాంట్రాక్టర్లకు అలాంటి గౌరవం దక్కడం అరుదైన విషయమన్నారు.

కర్నాటక రీజన్లో అత్యధిక ఇన్ కంటాక్స్ చెల్లించిన వ్యాపార వేత్తగా ఆయనకు బిరుదు ప్రదానం చేశారన్నారు. తన సుఖం కోసమే అనుకోలేదని ఆయన పుట్టిన ఊరికి అందులో భాగం ఇవ్వాలన్న సంకల్పంతో ఎన్నో మంచి పనులు చేశారు. వాటిలో ఎన్నదగినది రెడ్ క్రాస్ ఆస్పత్రి డబ్బుతో భవనం కట్టడమే కాదు నిర్వహణ ఖర్చు కూడా భరించాడు.ఆయన చేతి చలువ గొప్పది కాబట్టి ఈరోజు క్యాన్సర్ ఆసుపత్రి తన సొంత డబ్బుతో వేలాదిమంది నిరుపేద రోగులకు సంజీవని వల్లే ఉపకరిస్తున్నది. చిల్డ్రన్స్ పార్క్ ప్రాంతం అభివృద్ధి ఆయన చలవని, మున్సిపల్ చెత్త కుప్పగా ఉండిన ప్రాంతాన్ని అందమైన చిల్డ్రన్స్ పార్క్ గా తీర్చిదిద్దాడని, అప్పట్లో రెండు కోట్ల రూపాయలు పైగా వెచ్చించారు. దాని ఫలితంగా నెల్లూరు నగరానికి ఒక మేలిమి ఆభరణం వలె అభివృద్ధి చెందిన చిల్డ్రన్స్ పార్క్ ప్రాంతం. అంత ఉపకారం చేసిన జెఎస్ రెడ్డి పార్కుకు గాని ఆ ప్రాంతానికి గాని తన పేరు పెట్టాలని కోరుకోలేదు. నెల్లూరు నగర అభివృద్ధి తన ధర్మం అని వ్యవహరించారు. బెంచీలు బూజు పట్టిన గోడలతో మాసి ఉండిన టౌన్ హాల్ పునర్నిర్మాణం ఆయన చేతుల మీదుగానే జరిగింది. అక్కడ తన దానానికి గుర్తింపు రావాలని కోరుకోలేదని, నెల్లూరు కళాకారులకు తమ కళా ప్రదర్శనలు చేసుకునే వేదికగా టౌన్ హాల్ ఉపకరించాలని మాత్రమే కోరుకున్నారు. ఆ కోణంలో కొన్ని ఏళ్లపాటు నాటకోత్సవాలు నిర్వహించారు. వీటన్నిటికంటే ముఖ్యమైనది పామాలిన్ తోటల పెట్టడం. కొన్ని ప్రాంతాలలో రైతుల రాబడి పెంచడానికి అదొక మంచి మార్గమని తలచి మలేషియా వంటి దేశాలు తిరిగి అధ్యయనం చేసి నెల్లూరులో పామోలిన్ తోటల పెంపకాన్ని ప్రోత్సహించారు. మొక్కలను ఆయనే ఇచ్చారు. పంట ఆయనే ప్రాసెసింగ్ చేయించారు. ఇది వ్యాపారం కాదు కేవలం రైతులకు ఉపకారం మాత్రమే. దాదాపు 15 కోట్ల రూపాయలు వెచ్చించాడు. ఆయన ఈ కృషి కోసం చదువుకునే పేద విద్యార్థులు ఎన్ని వందల మందికి సహాయం చేసి ఉంటారు లెక్క పెట్టలేమని, పేరు కీర్తి కోరుకోకుండానే తన దానధర్మాలు సమాజ బాధ్యతగా భావించే విశాల హృదయం కలిగిన జేఎస్ రెడ్డి వంటి మంచి మనిషి మళ్ళీ పుట్టలేడు. ఆయన మృతి నెల్లూరు జిల్లాకు పూడ్చలేని లోటని అన్నారు.
జెఎస్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే జెకే రెడ్డి సోదరుడు జగదేవీపేట ఊర్లో కూడా ఒక ఆసుపత్రి కట్టించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని కేతిరెడ్డి తెలిపారు.
……