డా. కొణిజేటి రోశయ్యకు ఏఐటిఎఫ్ నివాళి

విల్లివాకం న్యూస్: డా. కొణిజేటి రోశయ్యకు అఖిల భారత తెలుగు సమాఖ్య (ఏఐటిఎఫ్) ఘన నివాళులర్పించింది. ఈ మేరకు సమాఖ్య అధ్యక్షులు ప్రొఫెసర్ సీఎంకే రెడ్డి ఒక ప్రకటనలో ఇలా తెలిపారు.


డా. కొణిజేటి రోశయ్య
(1933 – 2021)
రాజకీయ అపరచాణుక్యుడిగా, అజాతశత్రువుగా, అవిభక్త ఆంధ్రప్రదేశ్, ఆరుగురు ముఖ్యమంతులవద్ద పలుశాఖలలో సుదీర్ఘకాలం మంత్రిగా (1978-2009) పనిచేశారని, ఆపైన ఒక సంవత్సరం ముఖ్యమంత్రిగా
సేవలందించిన డాక్టర్ రోశయ్య 91వ జయంతి సందర్భంలో అఖిల భారత తెలుగు సమాఖ్య ఘన నివాళులర్పిస్తున్నట్లు తెలిపారు. తమిళనాడు గవర్నర్ గా (2011-16) అందరు తెలుగువారికి, సంస్థలకు అందుబాటులో ఉంటూ, ప్రోత్సహించిన వారి సహృదయత మరువలేనిదని, వారి పవిత్రాత్మకు దైవసాన్నిధ్యంలో శాంతిని ప్రసాదించమని కోరుతున్నట్లు తెలిపారు.


allindiatf.com
చిత్రమాలిక:
1. ఏఐటిఎఫ్ చీఫ్ ప్యాట్రన్ డాక్టర్ మోహన్ రెడ్డిని 22వ వార్షికోత్సవం సందర్భంగా (2011) సన్మానించడం
2. యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ (2012) సిండికేట్ మెంబర్‌గా నియమితులైన ప్రొఫెసర్ సీఎంకే రెడ్డిని గౌరవించడం
3. అజంతా ఫైన్ ఆర్ట్స్ ఫంక్షన్ (2013)
4. నెహ్రూ స్టేడియంలోని ముప్పెరుం విజాలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి శ్రీ జె చలమేశ్వర్ సమక్షంలో ప్రొఫెసర్ సీఎంకెఆర్ సన్మానం (2014)


5. ఏఐటిఎఫ్ ఉగాది కార్యక్రమంలో (2016) పద్మభూషణ్ డాక్టర్ పి సుశీలను సన్మానించడం
6. ప్రొఫెసర్ సీఎంకెఆర్ తన హైదరాబాద్ నివాసాన్ని సందర్శించారు (2018).


…………