మే 13న ఏపీ అసెంబ్లీ ఎన్నికలు

అమరావతి న్యూస్ :ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలకు మే 13న ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.ఇందుకు సంబంధించి ఏప్రిల్ 18న నోటిఫికేషన్ వెలువడనుంది.
ఏప్రిల్ 25 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 29 వరకు గడువు విధించారు. మరోవైపు ఏడు విడతల్లో లోక్ సభ ఎన్నికలను నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రకటించారు.

మరోవైపు ఎన్నికల సంఘం ప్రకటనతో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.

తమిళనాడులో ఒకే దశ ఎన్నికలు; ఏప్రిల్ 19న పోలింగ్ – ప్రధాన ఎన్నికల సంఘం

భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఈరోజు ఢిల్లీలో మీడియాతో సమావేశమయ్యారు. ఆ సమయంలో పార్లమెంట్ ఎన్నికలు 7 దశల్లో జరుగుతాయని తెలిపారు. ఏప్రిల్ 19న మొదటి దశ ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు.అదే విధంగా ఏప్రిల్ 19న తమిళనాడులో లోక్‌సభ ఎన్నికలు ఒకే దశలో జరుగుతాయని ఆయన తెలిపారు. విలవంకోడ్ అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా ఏప్రిల్ 19న ఉప ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు.

జూన్ 4న ఎన్నికల్లో పోలైన ఓట్లను లెక్కించి అదే రోజు ఫలితాలు వెల్లడిస్తామని తెలిపారు.