ఘనంగా బిషప్ ఏబెల్ నీలకంఠ జన్మదినోత్సవ వేడుకలు

టి.నగర్ న్యూస్: ఈసీఐ సౌత్ఆంధ్ర డయాస్ బిషప్, ఆల్ ఇండియా రెండవ వైస్ ప్రెసిడెంట్ బిషప్ ఆర్కే ఏబెల్ నీలకంఠ 68వ జన్మదినోత్సవ వేడుకలు మంగళవారం ఉదయం ఎంతో ఘనంగా జరిగాయి. చెన్నై న్యూ ఆవడి రోడ్డులోని గాంధీనగర్ ఈసిఐ బెరాకా చర్చి ఆవరణంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మెస్సయ్య ఫైర్ మినిస్ట్రీస్, వ్యవస్థాపకులు బ్రదర్ జి జాన్, క్రైస్ట్ ఫర్ ఆల్ మిషన్ వ్యవస్థాపకులు బిషప్ ఎస్ ప్రకాష్ రాజ్, టామ్స్ వ్యవస్థాపకులు డాక్టర్ గొల్లపల్లి ఇజ్రాయెల్, ఈసీఐ బిషప్ ప్రెసిడెంట్ డాక్టర్ డేవిడ్ ఒనేషిము, టామ్స్ వైస్ ప్రెసిడెంట్ వి దేవదానం, డాక్టర్ రాయ్, పాల్గొన్నారు. ముందుగా బిషప్ ఆర్కే ఏబెల్ నీలకంఠ కేకును కత్తిరించారు.

అలాగే ఈ సందర్భంగా రెవరెండ్ డాక్టర్ డేవిడ్ ఒనేషిము మాట్లాడుతూ ఈసీఐ సంస్థ అభివృద్ధిలో బిషప్ ఏబేలు నీలకంఠ పాత్ర ఎంతో కీలకమన్నారు. సౌత్ ఆంధ్ర డయాస్ ఆధ్వర్యంలో అనేక సంఘాలను నిర్మించి, వందలాదిమంది దైవ సేవకులను ఏర్పాటు చేయడం అనేక కుటుంబాలను అభివృద్ధి పథం లో నడిపించడంలో ఆయన చూపిన శ్రద్దాశక్తులు ఎంతో అభినందనీయం అన్నారు. ఆ దేవాది దేవుడు ఆయుష్ ఆరోగ్యాలను పెంచి మరింత ఉన్నత శిఖరాలకు ఆయనను తీసుకెళ్లాలని, మరింతగా దేవుని సేవలో విరివిగా పనిచేసేందుకు శక్తిని బలాన్ని ఇవ్వాలని కోరారు. అలాగే బిషప్ ఏబెల్ నీలకంఠ చేసిన సేవలను ముఖ్య అతిథులు కొనియాడారు. సంఘ అభివృద్ధి, దైవ సేవకుల శ్రేయస్సు, కుటుంబ బాధ్యత, సంఘాల నిర్మాణం పలు అంశాలను ఎంతో సమర్థవంతంగా నిర్వహించాలని వక్తలు ఆయన సేవలను అభినందించారు.

అనంతరం దైవ సేవకులకు బియ్యం పంపిణీ చేశారు. వీరిని సౌత్ ఆంధ్ర డయాస్ కౌన్సిల్ ఆధ్వర్యంలో సత్కరించారు. అలాగే తెలుగు మద్రాస్ సేవకులు, ఏరియా చైర్మన్లు, పాస్టర్లు, ముఖ్య అతిథులు శాలువలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిషప్ కమిషనర్లు రెవ. కె.ఎం.ప్రసాద్, రెవ. డి సురేష్ నాథ్, సెక్రెటరీ రెవ. రమేష్ బాబు, ట్రెజరర్ డాక్టర్ వి యోహన్, కమిటీ సభ్యులు రెవ. ఎం జయపాల్, రెవ. డి బాలరాజు, పలువురు దైవ సేవకులు పాల్గొన్నారు.