195 మంది అభ్యర్థులతో లోక్‌సభ ఎన్నికల తొలి జాబితాను ప్రకటించిన బీజేపీ.. రాష్ట్రాల వారీగా అభ్యర్థుల వివరాలు ఇవే..

చెన్నై న్యూస్ :రానున్న లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించి వరుసగా మూడోసారి కేంద్రంలో అధికారం చేపట్టాలని బీజేపీ భావిస్తుంది.ఈ క్రమంలోనే అందుకు తగ్గ ప్రణాళికలనకు కూడా సిద్దం చేస్తుంది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 370పైకి స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని, ఎన్డీయే మొత్తంగా 400కి పైగా స్థానాలను కైవసం చేసుకుంటుందని ప్రధాని మోదీ సైతం ధీమా వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదల కంటే ముందుగానే.. బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది.

శనివారం న్యూఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే ఈ వివరాలు వెల్లడించారు.195 అభ్యర్థులతో తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది. వారణాసి నుంచి ప్రధాని మోదీ మరోసారి పోటీ చేయనున్నట్టుగా వినోద్ తాన్డే. ఇక, ప్రధాని మోదీ అధ్యక్షతన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ గురువారం రాత్రి సమావేశమైంది. ఈ సమావేశంలో ఏప్రిల్-మేలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థుల మొదటి జాబితాను ఖరారు చేసేందుకు చర్చలు జరిపారు.రాష్ట్రాల వారీగా అభ్యర్థుల ప్రకటన ఇలా..ఉత్తరప్రదేశ్ -51పశ్చిమ బెంగాల్ -20,మధ్యప్రదేశ్-24, గుజరాత్-15, రాజస్థాన్-15, కేరళ-12తెలంగాణ-9అస్సాం-11జార్ఖండ్-11, ఛత్తీస్‌గఢ్-11, ఢిల్లీ-5జమ్మూ కశ్మీర్-2ఉత్తరాఖండ్-3,అరుణాచల్ 2, గోవా-1, త్రిపుర-1, అండమాన్-1, డామన్ అండ్ డయ్యూ-1కీలక అంశాలు..

16 రాష్ట్రాల్లోని పలు స్థానాలకు అభ్యర్థుల ప్రకటన

ఈ జాబితాలో 34 మంది కేంద్ర మంత్రులు, కేంద్ర సహాయ మంత్రులకు చోటు

ఈ జాబితాలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పేరు

ఇద్దరు మాజీ సీఎంల పేర్లు

ఈ జాబితాలో 28 మంది మహిళలకు చోటు

47 మంది అభ్యర్థులు 50 ఏళ్లలోపువారు.

జాబితాలో 27 మంది ఎస్సీ అభ్యర్థులు, 18 మంది ఎస్టీ అభ్యర్థులు..

జాబితాలో 57 మంది ఓబీసీ అభ్యర్థులు..

బీజేపీ ముఖ్య నేతలు పోటీ చేసే స్థానాలు..ప్రధాని మోదీ – వారణాసిఅమిత్ షా- గుజరాత్జ్యోతిరాదిత్య సింధియా – గుణరాజీవ్ చంద్రశేఖర్ – తిరువనంతపురంశివరాజ్ సింగ్ చౌహాన్- విదిషాఓం బిర్లా- కోటాదుష్యాంత్ సింగ్- జల్వార్కిరణ్ రిజిజు – అరుణాచల్ వెస్ట్సర్బానంద సోనోవాల్ – దిబ్రూగఢ్రాజ్‌నాథ్ సింగ్ – లక్నోస్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్- న్యూఢిల్లీమనోజ్ తివారీ- నార్త్ ఈస్ట్ ఢిల్లీశోభా సురేంద్రన్ -అలప్పుజహేమా మాలిని- మథురసాద్వీ నిరంజన్ జ్యోతి- ఫతేపూర్రవి కిషన్ – గోరఖ్‌పూర్