బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్.. ఆమె ఇంటి వద్ద హైటెన్షన్

హైదరాబాద్ న్యూస్: ఈడి అధికారులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు అరెస్ట్ వారెంట్ ఇచ్చారు. ఆమెను అరెస్టు చేసి తీసుకెళ్తున్నారు. సెర్చ్ వారెంట్ తో పాటు ఆమెకు అరెస్ట్ వారెంట్ కూడా ఇచ్చారన్న సమాచారంతో ఆమె ఇంటి వద్దకు బీఆర్ఎస్ నేతలు చేరుకుంటున్నారు.అక్కడ హైటెన్షన్ నెలకొంది. బీజేపీ, ఈడీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు.
కవిత అరెస్టుపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఇవాళ ఈడీ, ఐటీ సోదాలు నిర్వహించాయి. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత నివాసంలో సోదాలు జరిగాయి. కవితకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై ఈడీ ఈడీ, ఐటీ ప్రశ్నించిన్నట్లు సమాచారం. గతంలోనూ కవితను ఈడీ పలుసార్లు విచారించింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను కూడా దర్యాప్తు సంస్థలు విచారించాయి. ఆయనను కూడా అరెస్టు చేస్తారని ప్రచారం జరిగింది.

ఎన్నికల వేళ కుట్ర: బీఆర్ఎస్

ఎన్నికల వేళ కుట్రపూరితంగానే కవితను అరెస్టు చేశారంటూ బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ఎన్నికల్లో కేసీఆర్ ను నేరుగా ఎదుర్కోలేకే బీజేపీ ఇటువంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తున్నారు. ఎన్నికల కోడ్ మరో 24 గంటల్లో వస్తుందనగా కవిత ఇంటిపై ఈ దాడులు ఏంటని బీఆర్ఎస్ నేత క్రిశాంత్ ప్రశ్నించారు. ఎన్నికల షెడ్యూల్ ను శనివారం ప్రకటిస్తామని ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే.