రామోజీరావు మృతి : ప్రముఖుల సంతాపం

విల్లివాకం న్యూస్: ప్రముఖ పారిశ్రామికవేత్త, పత్రికాధినేత రామోజీరావు మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.

ఆయన ఎందరికో మార్గదర్శి : జె.ఎం నాయుడు

1970 నుంచి రామోజీరావుతో నాకు పరిచయం ఉంది. ఆయన సలహాలు, సూచనలు ఎంతో ఉపయోగకరంగాను జీవితాలను సరైన పద్ధతిలో నడిచేందుకు తోడ్పడ్డాయని తెలిపారు. నాలాంటి ఎందరికో ఆయన మార్గదర్శి అని ఆయనతో నాకున్న పరిచయం, ఆయన నాతో మాట్లాడిన మాటలు అద్భుతం అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు, వారి సహోద్యోగులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను..


– జె . ఎం.నాయుడు, అధ్యక్షులు, శ్రీ ఆంధ్ర కళా స్రవంతి, చెన్నై.
….
గొప్ప వ్యక్తి రామోజీరావు : తంగుటూరి రామకృష్ణ

రామోజీరావు శనివారం ఉదయం ఆయన దేవతా కమల పాదాలను తాకినట్లు తెలిసి నేను ఆశ్చర్యపోయాను. నాకు ఆయన వ్యక్తిగతంగా తెలుసు. అతను చాలా బలమైన, ధైర్యవంతుడు, మర్యాదపూర్వకమైన, సాధారణ మరియు గొప్ప వ్యక్తి. మీడియా, స్టూడియో, బిజినెస్‌లో ఇండియా లెవల్‌లో సంచలనం సృష్టించారు.
ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.

రామకృష్ణ తంగుటూరి,
గ్లోబల్ ప్రెసిడెంట్,
ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ.
….
ఆయనతో నాకు 30 ఏళ్ల పరిచయం

ఆయనతో నాకు 30 ఏళ్ల పరిచయం ఉందని మార్గదర్శితో నా ప్రయాణం కొనసాగుతుందని ఎం శ్రీనివాసరావు తెలిపారు. రామోజీరావులో ఉన్న నీతి, నిజాయితీ, కృషి, పట్టుదల, నిబద్ధత, కార్యదక్షిత, ఎంతో ఉన్నత స్థానానికి తీసుకెళ్లాయని, మాలాంటి ఎంతోమందికి ఆయన గొప్ప మార్గదర్శకంగా ఉన్నారని చెప్పారు, అలాగే తెలుగు భాష పట్ల ఆయనకు ఎంతో మక్కువ అని, తెలుగులోనే మాట్లాడి, తెలుగులోనే రాయాలనే గొప్ప భాషా ప్రేమికుడు అన్నారు. అలాంటి గొప్ప వ్యక్తిని కోల్పోవడం ఎంతో బాధాకరం, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు.


-ఎం శ్రీనివాసరావు, మార్గదర్శి, చెన్నై.
……..