తొలి తెలుగు న్యూస్ రీడర్ కన్నుమూత…..

అన్నా నగర్ న్యూస్ :తొలి తెలుగు TV న్యూస్  రీడర్  శాంతిస్వరూప్  కన్నుమూశారు. హైదరాబాద్  యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. గుండెపోటుతో రెండు రోజుల క్రితం ఆయన యశోదాలో చేరినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. దూర్ దర్శన్  తొలిసారి తెలుగు వార్తను చదివి శాంతిస్వరూప్  రికార్డు సృష్టించారు.ఇప్పుడంటే ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగి.. ఎలాంటి సమచారం అయిన మన అరచేతిలో వచ్చి వాలిపోతుంది. సెల్ ఫోన్లోనే.. మనకు కావాల్సిన ఎలాంటి సమాచారం అయినా మనకు దొరికిపోతుంది.అయితే ఒకప్పుడు మాత్రం వార్తలు గురించి రోజంతా వేచి చూడాలి. రాత్రి ఏడు గంటలకు టీవీల్లో అదీ దూర దర్శన్‌లో ఏడుగంటలకు మాత్రమే ఓ బులిటెన్‌లో జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర,రాజకీయ వార్తలు అన్నీ వచ్చేవి. ఆ వార్తలు చదివే న్యూస్ రీడర్ పేరు శాంతి స్వరూప్. ప్రభుత్వ ప్రచార సాధనమైనటువంటి దూరదర్శన్ లో తొలి తెలుగు యాంకర్‌గా ఆయన ప్రాముఖ్యత సంపాదించారు. అయితే శాంతి స్వరూప్ ఇవాళ కన్నుమూశారు. హైదరాబాద్ మలక్ పేట యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. తెలుగు దూరదర్శన్ పేరు చెప్పగానే అందరికీ శాంతి స్వరూప్ గుర్తుకు వచ్చేవారు.

1977 అక్టోబర్ 23న దూరదర్శన్ కార్యక్రమాలను నాటి రాష్ట్రపతి నీలం సంజీవ రెడ్డి ప్రారంభించగా.. మొట్టమొదటి యాంకర్ గా శాంతిస్వరూప్ పనిచేశారు. ప్రాంప్టర్ లేని సమయంలో తప్పులు లేకుండా జాగ్రత్తగా వార్తలు చదివి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2011లో ఆయన పదవి విరమణ పొందారు. ముఖ్యంగా దూరదర్శన్ టీవీలో తెలుగు ప్రజలకు వార్తలు చెప్పిన మొట్టమొదటి వ్యక్తి శాంతి స్వరూప్ కావడం విశేషం. సీనియర్ సినీ ప్రముఖులతో కూడా ఈయనకు పరిచయం ఉంది. శాంతి స్వరూప్ కి సినిమాలతోపాటు రాజకీయాల్లో కూడా మంచి అనుభవం ఉంది.
………………….