14న విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు

విల్లివాకం న్యూస్: క్రోధి నామ ఉగాది పండుగ 2024 ను పురస్కరించుకుని ఉత్తర మద్రాసు ఉగాది మహోత్సవ కార్యనిర్వహక వర్గం మరియు సర్ త్యాగరాయ కళాపరిషత్ వారు ఆదివారం మదరాసు 21 ప్రాతచాకలిపేట, నమశ్శివాయ ముదలి వీధిలో నున్న శ్రీ దేవాంగ సంఘం కన్నికల గుడి నందు 12 సంవత్సరముల లోపు బాల బాలికలకను మూడు విభాగములుగా విభజించి సుమతి శతకములు నుండి వక్తృత్వపు పోటీలు నిర్వహించారు.

యూకేజీ నుండి 3వ తరగతి వరకు సబ్ జూనియర్స్ వారికి 3 శతకములు, 4 నుండి 5 వ తరగతి విద్యార్థులకు జూనియర్స్ వారికి 5 శతకములు. సీనియర్స్ విభాగమునందు 6 నుండి 8 వ తరగతి విద్యార్థులకు 8 శతకములు ఉన్నాయి.
దాదాపు 46 గురు విద్యార్థిని విద్యార్థుల పాల్గొన్నారు.
సబ్ జూనియర్స్ విజేతలు
1.పూజాశ్రీ 2. ఏ. నేహలవిషెట్టి
బి. పార్ధు, 3. ఏ. నోవిత్, బి. వాహేశ్వరి జూనియర్స్ విజేతలు
1. లక్షిత్
2. గాట్సోజెన్
3. ఏ. రాఘవ్
బి. విడిప్
సీనియర్స్ విజేతలు
1. జ్ఞానికాశ్రీ
2. మీనాక్షి
3. ఏ అరుణేశ్వర్, బి యువశ్రీ
న్యాయనిర్ణేతలు మాచర్ల మునిరాజ, బుచ్చయ్య, నరసింహ
తదనంతరం చిత్రలేఖనం పోటీ నిర్వహించ బడినది.
ఈ పోటీలో
50 విద్యార్థినీ విద్యార్థుల పాల్గొన్నారు.
న్యాయనిర్నేత
ప్రముఖ కార్టూనిస్ట్ ప్రభు రామ్ వ్యవహరించారు.
విజేతలకు మరియు పోటీలో పాల్గొన్న వారందరికీ ఉగాది వేడుకల రోజున 14 ఏప్రిల్ 2024 ఆదివారం నాడు ప్రశంసా పత్రం మరియు బహుమతి ప్రదానం గావించబడును.
వ్యాఖ్యాతలుగా
1. సూరతి బలరాం
2. గజలక్ష్మి వ్యవహరించారు.
ఈ పోటీలను ఉత్తర మద్రాసు ఉగాది మహోత్సవ కార్యనిర్వహక వర్గం అధ్యక్షులు ఎంఆర్ సుబ్రహ్మణ్యం మరియు సర్ త్యాగరాయ కళాపరిషత్ అధ్యక్షులు డాక్టర్ నందివర్మన్ ,జక్కుల హరిక్రిష్ణ మరియు దేవీ మాధవయ్య లాంచనముగా ప్రారంభించారు.
……………………