ఘనంగా ఆంధ్రకళా స్రవంతి ఉగాది వేడుకలు

విల్లివాకం న్యూస్: శ్రీ ఆంధ్ర కళాస్రవంతి ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. దీనికి అరుంబాక్కంలోని డి.జి. వైష్ణవి కళాశాల ద్వారకా అడిటోరియం వేదికయింది. ఈ ఉగాది వేడుకలకు ముఖ్య అతిథిగా శ్రీ ఆదిత్యారామ్ (ఫౌండర్, చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఆదిత్యా గ్రూప్) పాల్గొన్నారు. విశిష్ట అతిథులుగా బద్రీనారాయణ ప్రసాద్ (ఐఎస్వి గ్రూప్ – ప్రమోటర్ మరియు చైర్మన్ ఆఫ్ కమిటీ) విచ్చేసారు.
ముందుగా ఈ ఉగాది వేడుకలు సాంసక్కృతిక కార్యక్రమాలతో ప్రారంభమయ్యాయి. స్నేహాంజలి ఆర్ట్స్, విశాఖపట్నం ఆధ్వర్యంలో కూచిపూడి, అరకు ధింసా, ఫ్యూజన్ నృత్యప్రదర్శన, కాంతారి, శ్రీశ్రీనివాస కళ్యాణ నృత్య ప్రదర్శన, శివతాండవము, స్ప్రింగ్ నృత్యము మరియు పాటల ప్రదర్శన వంటి పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు.
అనంతరం వేద పండితులు సుసర్ల కుటుంబశాస్త్రి పంచాంగ పఠనం చేసారు. శ్రీ ఆంధ్రకళా స్రవంతి అధ్యక్షులు జె.ఎం. నాయుడు స్వాగతోపన్యాసం చేసారు. ప్రధానకార్యదర్శి జె.శ్రీనివాస్ కార్యదర్శి నివేదిక చదివి వినిపించారు. అలాగే స్రవంతి సలహాదారు ఎం.ఎస్.మూర్తి అభినందన ప్రసంగం చేసారు. వి. సరితకుమారి సౌజన్యంతో 2024 శ్రీ ఆంధ్రకళా స్రవంతి ఉగాది పురస్కారాన్ని తెలుగు ఉపాధ్యాయులు డా. ఎ. మనోహరన్, పి.జి. అసిస్టెంట్ అందుకున్నారు. ప్రతి సంవత్సరం ఆంధ్రకళా స్రవంతి ప్రతిభ చాటిన విద్యార్థినీ విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్లు ప్రదానం చేస్తున్నది. ఇందులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (రాజ్యసభ సభ్యులు) సౌజన్యంతో దివ్యాంగ విద్యార్థులకు ల్యాప్ టాప్ బ్యాగ్లు ప్రదానం చేసారు. అలాగే ఎస్. నిరంజన్ కుమార్ సౌజన్యంతో శ్రీ వెంకటేశ్వర తెలుగు విద్యాలయం విద్యార్థులకు స్కూల్ యూనిఫాం వితరణ చేసారు. ఆర్.ఎమ్.కె. విద్యాసంస్థల సౌజన్యంతో 12వ తరగతి తెలుగు పాఠ్యాంశంలో 90 మార్కులు దాటిన 5 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 10 వేలు చొప్పున నగదు బహుమతి ప్రదానం జేసారు. అలాగే శ్రీ జయ విద్యానిలయముల సౌజన్యంతో ముగ్గురు 10వ తరగతి తెలుగు విద్యార్థులకు ఒక్కొక్కరికి 10 వేలు చొప్పున నగద బహుమతులు అందజేసారు.

ఇంకా ఆంధ్ర కళాస్రవంతి సభ్యులు జి. జగన్మోహనరావు, చారుగుండ్ల వెంకటేశ్వరరావు, సి. హెచ్. సాంబశివరావు, రాజలక్ష్మి ఫౌండేషన్, డి.ఆర్.కిరణ్, వి.ఎన్. అచ్యుతరామగుప్త, వి. వీరభద్రరావు, ఎమ్. చలపతి, రావి సాంబశివ రావు, ఎం. జమునా నారాయణ, బి. ఎన్ గుప్తా సౌజన్యంతో 10 మంది తెలుగు విద్యార్థులకు ఒక్కొక్కరికి 10 వేలు రూపాయలు నగదు బహుమతులు అందజేసారు.

ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు, స్రవంతి సభ్యులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్యక్రమంలో యడవల్లి ఆరుణా శ్రీనాథ్ ప్రార్థనాగీతం ఆలపించారు. కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా బిట్రా గజగౌరి, డా. నటరాజ్ వ్యవహరిస్తారు. చివరగా స్రవంతి కోశాధికారి జి.వి.రమణ వందన సమర్పణ చేసారు.
…………