పితృ దినోత్సవ శుభాకాంక్షలు

విల్లివాకం న్యూస్: నాన్న అంటే ధైర్యం, నాన్న అంటే బాధ్యత, నాన్న అంటే భరోసా. అన్నిటిని మించి త్యాగానికి మారుపేరు నాన్న. అమ్మ అనురాగ నిలయం. నాన్న అనుబంధానికి నెలవు. చిన్నారులకు తెలుగు వెలుగు సంక్షేమ సంఘం అధ్యక్షుడు అల్లింగం రాజశేఖర్ నాన్న విలువ తెలియపరిచారు.

విద్యార్థులంతా చిన్న వయస్సు నుంచే పెద్దలను విద్య నేర్పే గురువులను, మనల్ని ప్రేమగా చూసే తల్లిదండ్రులను, హాయ్ సార్, హాయ్ మేడం, హాయ్ మమ్మీలను ఇకమీదట హాయ్ అనే పదాన్ని వదిలి రెండు చేతులెత్తి నమస్కరించే విధానాన్ని అలవాటు చేసుకుని నమస్కారం నాన్న! అంటూ పిలవాలని విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. పెరంబూర్ నుంచి విచ్చేసిన సాయిని సత్కరించి విద్యార్థుల అందరికీ బిస్కెట్లు, స్వీట్లు పంచిపెట్టారు.