యోగ చేస్తే రోగాలు రాలేవు…!!

రేపు యోగా డేకి ఆస్పత్రిలో అన్నదానం

రాయలసీమ న్యూస్:
నేటి ఆధునిక జీవన విధానానికి అలవాటు పడిన ప్రజలు అనేక అనారోగ్యాలకు గురవుతున్నారని వీటన్నిటికీ సంపూర్ణ పరిష్కారమే యోగా అని ప్రతి ఒక్కరు యోగా చేయాలని మదనపల్లికి చెందిన అంతర్జాతీయ యోగా గురువు పాల్ బ్రహ్మకుమార్ తెలిపారు. అంతర్జాతీయ యోగ దినోత్సవం పురస్కరించుకుని యోగ సాధకుల ఆధ్వర్యంలో మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి నందు రోగులకు అన్నదానం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ యోగ దినోత్సవము ప్రతి సంవత్సరం జూన్ 21 న జరుపుకుంటారని తెలిపారు. 2014 సెప్టెంబరు 27న భారత ప్రధాని నరేంద్రమోడి ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 21న జరుపుకొనుట కోసం ప్రతిపాదన చేశారని. ఈ తీర్మానానికి 193 ఐరాస ప్రతినిధులలో 175 మంది మద్దతు ఇచ్చారన్నారు.భ ద్రతా కమిషన్ లో శాశ్వత సభ్యులుగాఉన్న అమెరికా, ఇంగ్లాండ్ చైనా, ఫ్రాన్స్, రష్యా వంటి దేశాలు కూడా ఈ తీర్మానానికి సహ ప్రతినిదులు విస్తృతమైన చర్చల తరువాత డిసెంబర్ 2014 లో ఆమోదించబడిందన్నారు. 2015 జూన్ 21 న మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నారు. జూన్ 21న యోగా దినోత్సవం జరుపుకోవడానికి గల కారణం జూన్ 21 ఉత్తరార్ధగోళంలో అత్యధిక పగటి సమయం ఉన్న రోజు. ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ఆ రోజుకు ప్రత్యేకత కూడా ఉంటుందని, ఎక్కువ పగటి సమయం ఉన్న రోజుగా గుర్తింపు పొందడంతో అది రోజును అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితి భారత సూచనల చేసిందని తెలిపారు. యోగాను జీవితంలో భాగం చేసుకోవడం వల్ల ఆరోగ్యంగా జీవించవచ్చన్నారు. రోగాలు దరి చేరవన్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో జీవితాన్ని సాగించవచ్చన్నారు.
…………………..