ఆకట్టుకున్న ‘సాహిత్యము – చమత్కార వైభవము’

విల్లివాకం న్యూస్: ప్రసంగంలో సభికులను ఆకట్టుకునేందుకు చమత్కారం ప్రధాన పాత్ర వహిస్తుందని సారస్వతోపాసకులు సాంప్రతి సురేంద్రనాథ్ వెల్లడించారు. వేద విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ‘తరతరాల తెలుగు కవిత’ ఉపన్యాస ధారావాహిక కార్యక్రమం ఆదివారం సాయంత్రం, చెన్నై, టీ.నగర్, విజయ రాఘవ రోడ్డులో గల ఆంధ్ర క్లబ్, కృష్ణా హాలు వేదికగా జరిగింది. ఇందులో 150వ ప్రసంగం పేరిట ఈ మాసం అంశం ‘సాహిత్యము – చమత్కార వైభవము’ పై వక్త గా విచ్చేసిన ముంబై, సారస్వతోపాసకులు సాంప్రతి సురేంద్రనాథ్ ప్రసంగించారు. ఆయన సాహిత్యంలో చమత్కారం అంటే ఏమిటనే విషయంపై అనేక ఉదాహరణలతో వివరించారు.

కార్యక్రమంలో సభికులను ఆకట్టుకునేందుకు చమత్కారం ప్రధాన పాత్ర వహిస్తుందని, అనేక మంది కవులు తమ రచనల ద్వారా దీనిని వెల్లడించినట్లు గుర్తుచేశారు. ముందుగా అరుణ శ్రీనాథ్ ప్రార్ధన గీతంగా అన్నమాచార్య కీర్తనను ఆలపించారు.
వేదిక కార్యదర్శి కందనూరు మధు స్వాగతోపన్యాసం చేశారు. అలాగే వక్త సాంప్రతి సురేంద్రనాథ్ ను కందనూరు మధు తో పాటు జెకె రెడ్డి తనయుడు విజయరెడ్డి సత్కరించారు. ఈ కార్యక్రమానికి నగరంలోని పలువురు సాహితీవేత్తలు, ప్రముఖులు హాజరయ్యారు.
…………………..