ఆకట్టుకున్న కవితాత్మక కావ్యం ‘నేను’

విల్లివాకం న్యూస్: డా.విశ్వర్షి వాసిలి కవితాత్మక కావ్యం ‘నేను’ పై చేసిన ప్రసంగం ఆహూతులను ఎంతగానో ఆకట్టుకుంది. వేద విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ‘తరతరాల తెలుగు కవిత’ ఉపన్యాస ధారావాహిక 149వ ప్రసంగ కార్యక్రమం ఆదివారం సాయంత్రం జరిగింది. దీనికి చెన్నై, టీ.నగర్, విజయ రాఘవ రోడ్డులో గల ఆంధ్ర క్లబ్, కృష్ణా హాలు వేదికయింది.

ఇందులో విశ్వర్షి వాసిలి విరచిత ‘ఏడో ఋతువు’ వర్తమాన వచన కవితా సంపుటి పుస్తక ఆవిష్కరణ జరిగింది. అలాగే ఈ మాసం అంశంగా తొలి తెలుగు యోగిక కావ్యం ‘నేను’ వైవిధ్యత, వినూత్నత అనే అంశంపై హైదరాబాద్, విశిష్ట యోగిక విశ్వకవి విశ్వర్షి వాసిలి (డా. వాసిలి వసంత కుమార్) ప్రసంగించారు. ‘నేను’లోని అసంఖ్యాక భావకోణాలను వాసిలి ఈ కావ్యం ద్వారా లోతుగా, అత్యంత కవితాత్మకంగా ఆవిష్కరించారు. ముందుగా ఆయనను అధ్యక్షులు జెకె రెడ్డి, కార్యదర్శి కందనూరు మధు సత్కరించారు. ఈ కార్యక్రమానికి
విస్తాలి శంకరరావు సహా పలువురు సాహిత్యాభిలాషులు హాజరయ్యారు.