వైభవంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం.

టీ నగర్ న్యూస్ : శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఎంతో వైభవంగా తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా నిర్వహించారు. చెన్నై మహానగరంలోని పులియాంతోపు నరసింహానగర్ లో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో 46వ ఏడాది వార్షిక శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఆదివారం జరిగింది.

పీటలపై సీతారాములను పెళ్లి వస్త్రాలలో అలంకరించి వేద పండితుల మంత్రోచ్ఛరణ, పెళ్లి మంత్రాలు, మంగళ వాయిద్యాలు మధ్య జై శ్రీరామ్ నామస్మరణతో ఎంతో వైభవంగా సీతారాముల కళ్యాణ మహోత్సవ ఘట్టం జరిపించారు.

ఈ కళ్యాణ మహోత్సవానికి హాజరైన భక్తులకు వడపప్పు, పానకం, అన్నదానం చేశారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లను ఉత్సవ కమిటీ నిర్వాహకులు గంగుల లింగయ్య, కోటపాటి వెంకటేశ్వర్లు, పందిటి జయరాములు, కృష్ణమూర్తి, బొంటుపల్లి వెంకటేశ్వర్లు, సంకె మాధవమూర్తి, సిహెచ్ మురళి, లింగం గుంట కిరణ్, కొప్పుల అంకయ్య, అల్లూరి గిరి, ఆండ్రా కొండలరావు, పంబా నారాయణ, ఎన్ తిరుమలరావు, జంక మహేష్, యామర్తి కొండల రావు, సిహెచ్ శంకర్ ఏర్పాట్లు చేయగా, తెలుగు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ సీతారాములను దర్శించుకుని దైవ ఆశీస్సులు పొందారు.
………………………