ఘనంగా సామూహిక గాయత్రీ జపం

విల్లివాక్కం న్యూస్:
చెన్నై, ఈసిఆర్ రోడ్ లోని ఉత్తండి సమీపానగల మత్స్యనారాయణ దేవాలయంలో ఆదివారం విశ్వశాంతి మరియు లోక కల్యాణార్థం హైదరాబాదుకు చెందిన కె.సి.దాస్ స్మారక సేవ సంస్థ ఆధ్వర్యంలో ఉదయం 7గంటల నుండి 9 గంటల వరకు చెన్నై మండల జపతులు ప్రత్యక్ష సామూహిక ప్రాతః సంధ్యావందనం మరియు సామూహిక గాయత్రీ జపం అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.

విశ్వశాంతి మరియు సామరస్యాన్ని సాధించుట కొరకు పూజ్య గురువులు బ్రహ్మశ్రీ కల్వకొలను శ్రీరామ చంద్రమూర్తి మార్గదర్శనతో అయోధ్యలో 2024, జులై 27 నుంచి 31 వరకు జరగబోయే బృహత్కార్యం శతకోటి గాయత్రి మహా మంత్రం జప యజ్ఞం మహా పూర్ణహుతి దిగ్విజయముగా జరుగుటకు మనమందరం సిద్ధం కావాలని చెన్నై మండల సమన్వయకర్త పోరూరి శ్రీనివాసరావు జపతులను అభ్యర్థించారు. ఇందులో పోరూరి శ్రీనివాసరావుతో పాటు రాధాకృష్ణ మూర్తి దేవులపల్లి, పూళ్ల శ్రీకాంత్, శ్రీధర్ భూమరాజు, సాయి తేజ భూమరాజు, నాగ సంపత్ కుమార్ అనుపురువద్రాజు, కామేష్ ఏడిద, మహేష్ కోటికే, కళ్యాణ్ చక్రవర్తి వంకమామిడి, చైతన్య, రవికిరణ్ పాల్గొన్నారు.