అన్నానగర్ లో సదరన్ ట్రావెల్స్ కొత్త శాఖ

విల్లివాకం న్యూస్: పర్యాటక రంగంలో రాణిస్తున్న సదరన్ ట్రావెల్స్ చెన్నై అన్నానగర్ లో బుధవారం కొత్త శాఖను ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తమిళనాడు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, స్పెషల్ సెక్రటరీ బి కృష్ణమూర్తి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. గౌరవ అతిధులుగా అడయార్ ఆనంద భవన్ గ్రూప్, మేనేజింగ్ డైరెక్టర్ కె టి శ్రీనివాస రాజా, అజంతా సుపారీ గ్రూప్, చైర్మన్ కె శంకరరావు, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ, గ్లోబల్ ప్రెసిడెంట్ టంగుటూరి రామకృష్ణ, ఆంధ్ర కళా స్రవంతి అధ్యక్షులు జెయం నాయుడు, జయరాజ్ ఇంటర్నేషనల్, అధినేత టి రాజశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సదరన్ ట్రావెల్స్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. సదరన్ ట్రావెల్స్ నిర్వాహకులు ఆలపాటి కృష్ణమోహన్, ఆలపాటి వెంకట ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ సదరన్ ట్రావెల్స్ అంతర్జాతీయంగా పర్యాటకులకు సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.

సమయపాలన, నగదు పొదుపు, పారదర్శకత, ప్రయాణికులకు సౌకర్యవంతమైన సంతోషకరమైన సేవలను గత 54 ఏళ్లుగా అందిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 18వ అవుట్ లెట్ అన్నా నగర్ లో ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. వచ్చే నెలలో కోయంబత్తూరు, కొచ్చిన్ లలో శాఖలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది ఎవరు బుక్ చేసినా లక్కీ డ్రా విన్నర్స్ కు మార్చి 25 లో కియా కారు బహుమతిగా ఇస్తామన్నారు. అలాగే వామ్ సభ్యులకు ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్ ఇస్తున్నట్లు తెలిపారు. ముఖ్య అతిథి కృష్ణమూర్తి మాట్లాడుతూ సదరన్ ట్రావెల్స్ దక్షిణాది ప్రాంతాలకే పరిమితం కాకుండా ప్రపంచ స్థాయిలో పేరొందినట్లు తెలిపారు. అజంతా శంకరరావు మాట్లాడుతూ సదరన్ ట్రావెల్స్ తో 50 సంవత్సరాలుగా అనుబంధం ఉందని, కొత్తగా ఈ శాఖను ప్రారంభించడం సంతోషకరమని అన్నారు. బిజెపి ఉపాధ్యక్షులు చక్రవర్తి మాట్లాడుతూ అద్భుతమైన సౌకర్యాలతో పర్యాటకులకు సేవలందించడం అభినందనీయమన్నారు.

ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ అధ్యక్షులు తంగుటూరి రామకృష్ణ మాట్లాడుతూ అత్యధిక బ్రాంచీలు కలిగిన ఏకైక ట్రావెల్స్ సంస్థగా సదరన్ ట్రావెల్స్ నిలిచిందని వారి సేవలు అభినందనీయమని అన్నారు. కేంద్ర ప్రభుత్వ టూరిజం కౌన్సిల్ లో కూడా కృష్ణమోహన్ సభ్యులుగా ఉన్నారని అన్నారు. వరుసగా కేంద్ర ప్రభుత్వం నుంచి 8 సార్లు బెస్ట్ టూరిజం అవార్డు రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డుల అందుకోవడం హర్షనీయమన్నారు. ఇందులో వామ్ మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీలత, జివి రమణ తదితరులు పాల్గొన్నారు.