9న దేవాంగ పెండ్లి సమాజము ఉగాది వేడుకలు

విల్లివాకం న్యూస్: దేవాంగ పెండ్లి సమాజము ఆధ్వర్యంలో శ్రీ క్రోధి నామ ఉగాది వేడుకలు ఈనెల 9వ తేదీ సాయంత్రం 4:00 గంటలకు పాత చాకలిపేటలో గల శ్రీ రామలింగ చౌడేశ్వరి దేవి ప్రేయర్ హాలులో జరగనున్నాయి. ముందుగా గీతా పారాయణం, పంచాంగ శ్రవణం ఉంటుంది. అనంతరం యారాసి యుగంద్ర స్వాగతోపన్యాసం చేయనున్నారు. పముజుల సుబ్బయ్య అధ్యక్షోపన్యాసం చేయనున్నారు. ముఖ్య అతిథిగా డాక్టర్ మనమ మునిరత్నం విచ్చేయనున్నారు. విశిష్ట అతిధులుగా డాక్టర్ పిట్టి హెచ్ రఘురాం, డాక్టర్ టి మోహనశ్రీ, కోణంకి రవి, పిట్టి ఎం కృష్ణవేణి హాజరుకానున్నారు ప్రత్యేక అతిధులుగా కోనంకి జనార్ధనం హాజరుకానున్నారు. ఇందులో చందుస్ నాట్యాలయ నృత్య ప్రదర్శనలు ఉన్నాయి.
ఉగాది వేడుకలు సందర్భముగా మన తెలుగు మహిళలకు, బాల బాలికలకు మరియు చిన్నారులకు రక రకాల పోటీలు ఈ క్రింద కనుపరిచిన విధముగా దేవాంగ పెండ్లి సమాజము తరపున నెం. 23/49, బసవయ్య వీధి, చెన్నై – 21 యందుండు శ్రీ రామలింగ చౌడేశ్వరి దేవి ప్రార్ధనా మందిరము నందు నిర్వహించబడును.
1. మహిళలకు : 6.4.2024 శనివారము రోజున ఉదయం 10.00 గం॥ల నుండి మధ్యాహ్నం 1.00 గం॥ల వరకు చుక్కల ముగ్గుల పోటీలు (ఒకరికి రెండు గం॥లు సమయము మాత్రమే పరిమితం) మరియు సాయంత్రం 4.00గం||ల నుండి బాస్కట్ బాల్ (Basket Ball) పోటీలు మరియు 45 వయస్సులోపు మహిళలకు మ్యూసికల్ చైర్ (Musical Chair) పోటీలు నిర్వహించబడును.
2. బాలబాలికలకు : 6.4.2024 శనివారము మరియు 7.4.2024 ఆదివారము రోజున
శనివారం సాయంత్రం 3:30 గంటల నుంచి రెండు భాగములుగా అనగా 6 సం॥ల నుంచి 9 సం॥ లోపు వారికి మరియు 9 సం॥ల నుంచి 12సం॥ లోపు వారికి క్రింద కనుపరచిన పోటీలు నిర్వహించబడును. i. సుమతి శతకము నుంచి పద్య పోటీలు – 6.4.2024 (శనివారము) రోజున జరుపబడును. 6 సం||ల నుంచి 9 సం॥ లోపు వారికి 3 పద్యములు 9 సం||ల నుంచి 12 సం|| లోపు వారికి 5 పద్యములు 7.4.2024 (ఆదివారము) రోజున జరుపబడు పోటీలు. ii. సాక్ రేస్ (బాలురకు మాత్రమే)
iii. దాటవేయడం (అమ్మాయిలకు మాత్రమే)
iv. నిమ్మకాయ & చెంచా (అబ్బాయిలు & అమ్మాయిలు విడివిడిగా) v. Fancy Dress Competition 6 ລ້ ລ້ 10 9.4.2024 (మంగళవారము) రోజున సా॥ 5.00 గం||లకు జరుపబడును. (తెలుగు భాష మాత్రమే) 3. చిన్నారులకు : 6.4.2024 శనివారం రోజున సాయంత్రం 5.30 గం॥లకు 3 సం॥ల నుంచి 5 సం॥ల లోపు చిన్నారులకు Running Race మరియు Activity పోటీలు నిర్వహించబడును. పై పోటీలలో మొదటి మూడు స్థానములు గెలుపొందిన వారికి ఉగాది సంబరాలు రోజున (9.4.2024 మంగళవారము) బహుమతి ప్రదానము జరుపబడును. పై పోటీలలో పాల్గొన దలచినవారు 3.4.2024 బుధవారము రోజు ॥ 8.00 గం॥ లోపు దేవాంగ పెండ్లి’ సమాజ కార్యాలయము నందు నమోదు చేయవలసినదిగా తెలియజేయడమైనది. సంప్రదించవలసిన సెల్ నెం. 8610557006, 9884511081
గమనిక : తెలుగు మాతృభాష వారికే అనుమతి. పోటీలకు సంబందించిన కార్యక్రమాల విషయంలో కార్యనిర్వాహక వర్గము వారిదే తుది నిర్ణయం.
……………………