యూఏఈలో యూపీఐ రూపే కార్డు సేవలను ప్రారంభించిన ప్రధాని మోదీ..

న్యూఢిల్లీ న్యూస్:ప్రధాని నరేంద్ర మోదీ , యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE) అధ్యక్షుడు షేక్‌ మహ్మద్‌ బిన్‌ జాయేద్‌ అల్‌ నహ్యాన్‌తో కలిసి ఆ దేశంలో యూపీఐ (UPI) రూపే కార్డు సేవలను ప్రారంభించారు.
మంగళవారం ఉదయం భారత్‌ నుంచి బయలుదేరిన ప్రధాని మోదీ.. సాయంత్రం యూఏఈ రాజధాని అబుదాబికి చేరుకున్నారు.
అబుదాబిలో అడుగుపెట్టిన ప్రధానికి ఘన స్వాగతం లభించింది. యూఏఈ సైన్యం ప్రధానికి గౌరవ వందనం సమర్పించింది. అనంతరం యూఏఈ అధ్యక్షుడు షేక్‌ బిన్‌ జాయేద్‌ అల్‌ నహ్యాన్‌.. ప్రధాని మోదీని ఆలింగనం చేసుకుని అబుదాబిలోని తన అధికారిక నివాసంలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఇరు దేశాల అధినేతల మధ్య ద్వైపాక్షిక అంశాలపై చర్చ జరిగింది.
ఈ చర్చల్లో కదిరిన ఒప్పందాలపై రెండు దేశాల అధినేతలు సంతకాలు చేశారు. అనంతరం యూపీఐ కార్డు సేవలను ప్రారంభించారు. యూఏఈ అధ్యక్షుడు అల్ నహ్యాన్‌ ఈ కార్డు ద్వారా తొలి ట్రాన్సక్షన్‌ చేశారు. పర్యటనలో భాగంగా ప్రధాని యూఏఈతోపాటు ఖతార్‌లో కూడా పర్యటించనున్నారు. కాగా, యూపీఐ కార్డు సేవలు సోమవారం మారిషస్‌, శ్రీలంక దేశాల్లో కూడా ప్రారంభమయ్యాయి.https://twitter.com/ANI/status/1757368963405647882?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1757368963405647882%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=http%3A%2F%2Fapi-news.dailyhunt.in%2F