రామోజీరావు మరణం నన్ను ఎంతో కలచివేసింది…. కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి

చెన్నై న్యూస్ :ఈనాడు ప్రధాన సంపాదకులు శ్రీ రామోజీరావు గారి మరణం తననూ ఎంతో కలచివేసిందని.అక్షరం అనాధ కాకుండా ఉండలంటే వారు ఇప్పటివరకు తెలుగు భాష పట్ల వారు చూపిన ప్రేమ ను ,వారి స్ఫూర్తి ని ,.మనమంతా వారి మార్గంలో నడిచి నిరంతర అక్షర శ్రమికులుగా వెలుగొందలని తమిళనాడు తెలుగు యువ శక్తీ అధ్యక్షుడు ,తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ అప్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి నేటి యువత రామోజీరావు గారి మార్గంలో పయనించి తెలుగు భాషను కాపాడాలని అప్పుడె మనం నిజమైన నివాళీ అర్పించినట్లు అవుతుందని యువతకు పిలుపు ఇచ్చారు.

కేతిరెడ్డి తనకు రామోజీరావు గారు అటు చలన చిత్ర నిర్మాత గా దర్శకుడు గా ,తెలుగుభాష ఉద్యమనాయకుగా 1995 నుంచి నేను బాషా పట్ల చేయు ఉద్యమల వివరాలను వారికి తెలిపి వారి సలహా సంప్రదింపులు తీసుకొనే వాడినని..బాషా కొరకు తమిళనాడు హోసూర్ లో చేసిన మహాధర్నా కూడా వారికి తెలపటం జరిగిందని ,2016 లో రామోజీరావు గారిని కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డు తో సత్కరించగా నేను అభినందన సందేశం పంపగా వారు తన సందేశం లో జీవితంలో నేను విజయ శిఖరాలను అధిరోహించలని కోరుకొని ఆశీర్వాదించటం వారి గొప్ప హృదయ నికి నిదర్శనమని ..వారి పార్థివ దేహాన్ని సందర్శించి న తరువాత వారికి నివాళులు అర్పించి విలేకరులతో కేతిరెడ్డి తెలుపుతూ..తాను నిర్మాత అవ్వటానికి వారే కారణమని..ఫిల్మ్ నెగెటివ్, ఫైనాన్స్ అన్ని వసతులు కల్పించి.దక్షిణాది లో ఒక నిర్మాత.దర్శకుడు అయ్యే దానికి కారకుడు అయ్యినారని..వారి మరణం మాలాంటి వారికి తీరని లోటని తెలిపారు….

……………