సామాజిక సేవలో సింగంశెట్టి యతీంద్రులు చెట్టి ఛారిటీస్

ఇంటికి పిలిచి ఇచ్చేది విందు
అడిగిన తర్వాత ఇచ్చేది బిక్షం
ఎవరికి తెలియకుండా ఇచ్చేది దానం
వెతుక్కుంటూ వెళ్లి ఇచ్చేది ధర్మం

ఈ నానుడికి తగ్గట్టు చెన్నై మహానగరంలో నెలకొని ఉన్న సింగంశెట్టి యతీంద్రులు చెట్టి ఛారిటీస్ ధర్మ సంస్థాపన సంస్థ పలు సంవత్సరాలుగా అలుపెరుగక అనేక ధర్మ, కంకైర్యములను అర్హత గల సంస్థలకు, వెనుకబడియున్న సమాజ, సామూహిక ప్రజలకు, విద్యార్థిని విద్యార్థులకు, ఉపాధిని ఆశించు నిరుపేదలకు అందించుట బహు ముదావహం.

గత పది రోజులుగా చెన్నై మహానగరం పొలిమేరలలో ఉన్న ప్రాంతాలకు నేరుగా వెళ్లి 110 మంది విద్యార్థిని విద్యార్థులకు నోటు పుస్తకాలు, 50 మంది నిరుపేద, అనాథ, వీధిన పడిన స్త్రీల వద్దకు స్వయంగా వెళ్లి నూలుతో తయారు చేయబడిన మొదటి రకం చీరలు పంపిణీ చేశారు.

ఈ ధర్మ సత్కార్యము ఛారిటీస్ యాజమాన్యమున చోటు చేసుకున్న ట్రస్టీ పసుమర్తి బద్రీనాథ్ కృషి, సలహాలతో విశ్రాంత ఉపాధ్యాయులు పి.ఆర్ కేశవులు స్వయంగా వీక్షించి సహాయ సహకారాలను అందించి తద్వారా ఉపశమనం కలిగించారు.

…విల్లివాకం న్యూస్
……………