సీతారామయ్య సేవలు చిరస్మరణీయం
– స్మృత్యంజలి సభలో వక్తలు

చెన్నై న్యూస్:వైద్య, సాహిత్య , సమాజ సేవ రంగాలలో కందనూరు సీతారామయ్య సేవలు చిరస్మరణీయం అని ,ఆయన స్మృత్యంజలి సభలో పలువురు వక్తలు కొనియాడారు.వేద విజ్ఞాన వేదిక కార్యదర్శి కందనూరు మధు తండ్రి
డాక్టర్ సీతారామయ్య వృద్దాప్యం కారణంగా ఈ నెల 8వ తేదీన మృతి చెందిన విషయం తెలిసిందే.ఈ మేరకు చెన్నై టి.నగర్ లోని ఆంధ్రా క్లబ్ గోదావరి హాలు లో సీతారామయ్య స్మృత్యంజలి సభలో బుధవారం
జరిగింది.

ముందుగా తెలుగు ప్రముఖులు ప్రొఫెసర్ సి ఎం కె రెడ్డి, వేదవిజ్ఞాన వేదిక అధ్యక్షులు జె కె రెడ్డి , ఏచూరి చలపతిరావు , సనత్ కుమార్ రెడ్డి, బొమ్మిరెడ్డి సురేంద్ర, శ్రీనివాస రాజు , ప్రముఖ నటి సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి సూర్యకాంతం కుమారుడు అనంత పద్మనాభ మూర్తి రాధా లక్ష్మి తదితరులతో కలసి సీతారామయ్య కుమారులు కందనూరు మధు, డాక్టర్ శ్రీరామ్, కుటుంబ సభ్యులు పుష్పాంజలి ఘటించారు అనంతరం జె కే రెడ్డి, అరుణ శ్రీనాధులు కలసి అన్నమయ్య కీర్తనలను శ్రావ్యంగా ఆలపించారు.అలాగే భగవద్గీత లోని శ్లోకాలను వినిపించారు.

ఈ సభలో మాట్లాడిన తెలుగు ప్రముఖులు సీతారామయ్య తో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ వారి సేవలను కొనియాడారు.