పీఈటీ కన్ను పడితే అంతే…!!

ఎవ్వరికీ చెప్పుకోలేక సతమతం

వాడు పీఈటీ కాదు కామ మృగం

అది కళాశాల కాదు కామ శాల

అమ్మాయిలను వేధిస్తుంటే యాజమాన్యం ఏం చేస్తున్నట్లు..?

క్రిమినల్ చర్యలు తీసుకోవాలి

ప్రజా సంఘాలు, తల్లిదండ్రులు డిమాండ్

రాయలసీమ న్యూస్: గురువంటే దైవంతో సమానమంటారు. అయితే ఓ పీఈటీ గురువు విలువలు మరచి కామ మృగంగా వ్యవహరించాడు. గురు వృత్తికే మాయని మచ్చ తెచ్చాడు. చదువుకోడానికి కళాశాలకు వచ్చే విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడు. కోరిక తీర్చమనేవాడు. పీఈటీ క్లాసుల్లో అదోలా చూసేవాడు. అతని కన్నులో పడ్డ వారిని టార్గెట్ చేసేవాడు. అంతేకాదు ప్రేమించాలని వెంటపడేవాడు. వాడికి పెళ్లయి పిల్లలున్నా కూడా బుద్ధి పక్కదారి పట్టింది. మాట వినని వారిని భయపెట్టి కళాశాలలో రూముకు పిలిపించుకుని ఫోటోలు తీసుకునేవారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె- అంగళ్లు మార్గంలోని ఓ జూనియర్ కళాశాలలో రెండేళ్లుగా భాస్కర్ (33) అనే ఫీఈటీ ఇలాంటి అకృత్యాలకు దిగ జారాడు. ఇతను సీనియర్ ఇంటర్ చదువుతున్న అమ్మాయిని ఆరు నెలలుగా ట్రాప్ చేశాడు. భయపెట్టి పోటోలు కూడా అసభ్యంగా తీసుకున్నాడు. చెప్పినట్లు వినకపోతే ఫోటోలు వైరల్ చేసి జీవితాన్ని నాశనం చేస్తానని బెదరించేవాడు. ఈ విషయాన్ని అమ్మాయి తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లడంతో అతనిపై ముదివేడు పోలీసులు ఇటీవల పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. విచారణలో ఇంకా పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ఈ సంఘటన అంతటా కుదిపేస్తోంది. తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీడు ఇంకా మరికొందరి అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించేవారని సమాచారం. ఒక వేళ అమ్మాయిలు వీడి చేష్టలకు భయపడి కళాశాలకు రాకపోతే అదే పనిగా తల్లిదండ్రులకు పోన్ చేసి రప్పించుకునేవాడు. వీడి ప్రవర్తనకు ఎందరు.. ఎంతగా ఇబ్బంది పడ్డారో తలచుకుంటేనే వళ్లు జలదరిస్తోంది. అంతగా అమ్మాయిలను టార్చర్ పెట్టినట్లుగా తెలుస్తోంది. వీడు రెండేళ్లుగా అక్కడ పిఈటిగా పనిచేస్తున్నాడు. దీన్ని బట్టి వీడి చేష్టలకు ఎందరు బలై ఉంటారో తలచుకుంటే భయమేస్తుంది. కామ పిశాచికి యాజమాన్యం పీఈటీగా అవకాశం ఇచ్చారు. రెండేళ్లుగా పనిచేస్తున్నా ఈ మృగాడి చేష్టలను, ప్రవర్తనను గుర్తించలేకపోయారంటే యాజమాన్యం ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వీడి లైంగిక వేధింపులకు బలైన కొందరి అమ్మాయిల పోటోలు కూడా బయటపడ్డాయి. వీరు ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో పాపం.. ఇంత జరుగుతున్నా ప్రిన్సిపాల్ ఏం చేస్తున్నట్లో ఎంత నిర్లక్ష్యంగా వహించారో క్షమించరానిది.. ప్రిన్సిపాల్, కళాశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అదే విధంగా కళాశాల గుర్తింపును రద్దు చేయాలని వివిధ ప్రజా సంఘాలు డిమాండు చేస్తున్నాయి. లేదంటే కళాశాల ముందు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ విషయమై ముదివేడు ఎస్ఐ మల్లికార్జున రెడ్డిని విచారించగా పీఈటిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. అరెస్టు చేసి రిమాండుకు తరలిస్తున్నట్లు వెల్లడించారు. అమ్మాయిలను వేదిస్తున్నా కళాశాల ఇతని ప్రవర్తనను పసిగట్టలేకపోవడంతో ఇక తిరుగులేదని మనిషి కాస్తా కామ మృగంగా మారిపోయారు. అమ్మాయిలతో కిరాతక క్రీడ నడిపించారని వెల్లడవుతోంది. ఇలాంటి దుర్మార్గున్ని ఊరికే వదల కూడదని కళాశాల యాజమాన్యంపై కూడా కఠిన చర్యలు డిమాండ్ చేస్తున్నారు.
……………….