ఘనంగా తమిళనాడు తెలుగు సాంస్కృతిక సంఘం ఉగాది వేడుకలు

విల్లివాకం న్యూస్: తమిళనాడు తెలుగు సాంస్కృతిక సంఘం (టిటిసిఏ) ఆధ్వర్యంలో ‘శ్రీ క్రోధి నామ తెలుగు నూతన సంవత్సర ఉగాది వేడుకలు’ మంగళవారం సాయంత్రం ఘనంగా జరిగాయి. దీనికి పెరంబూరు డిఆర్ బిసిసి మహోన్నత పాఠశాల, శ్రీముక్కాల నమ్మాళ్వార్ శ్రేష్టి ఆడిటోరియం వేదికగా నిలిచింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంస్థ అధ్యక్షులు తమ్మినేని బాబు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా దక్షిణ రైల్వే డివిజనల్ రైల్వే మేనేజర్ బి. విశ్వనాథ్ ఈర్య విచ్చేశారు. విశిష్ట అతిథిగా చెన్నై, సింహాద్రి కన్స్ట్రక్షన్స్, వెలమ్ శ్రీనివాసులు, ఆత్మీయ అతిథిగా పారిశ్రామికవేత్త నర్రావుల వెంకటరమణ హాజరయ్యారు. ఇందులో డాక్టర్ టిఆర్ఎస్ శర్మ పంచాంగ పఠనం గావించారు. ముందుగా అరుణ శ్రీనాథ్ ప్రార్ధన గీతాన్ని ఆలపించారు. అలాగే, తమ్మినేని బాబు స్వాగతోపన్యాసం చేశారు. అనంతరం అతిథులను ఉచిత రీతిన సత్కరించారు. అలాగే, ప్రతిభ చాటిన విద్యార్థిని, విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు.

ఇందులో డాక్టర్ షీలా ఉన్నికృష్ణన్ నాట్య బృందం సాంస్కృతిక కార్యక్రమం అలరించింది. చివరిగా కె రమాదేవి వందన సమర్పణ చేశారు. నిడమర్తి వసుంధరా దేవి సభా నిర్వహణ గావించారు. ఈ కార్యక్రమానికి జనని ప్రధాన కార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్య, నగర ప్రముఖులతో పాటు అనేకమంది హాజరయ్యారు.