ఉచిత నేత్ర వైద్య శిబిరానికి అనూహ్య స్పందన

విల్లివాకం న్యూస్: చెన్నై పెరంబూరు, పటేల్ రోడ్డులో గల శ్రీ వేంకటేశ్వర చారిటబుల్ ట్రస్ట్, మైలాపూరు, ఉది కంటి ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం ఆదివారం ఉదయం జరిగింది. దీనికి అనూహ్య స్పందన లభించింది. దీనిని ప్రముఖ పారిశ్రామికవేత్త డి. జంబు లాంచనంగా ప్రారంభించారు.

ఈ శిబిరానికి సుమారు 250 మంది విచ్చేశారు. వారికి కళ్ళకు సంబంధించిన అన్ని పరీక్షలు జరిపారు. 175 మందికి ఉచితంగా కళ్ళ అద్దాలు పంపిణీ చేశారు. 8 మందికి ఉచిత కేటరాక్ట్ శస్త్ర చికిత్సలకు ఏర్పాట్లు చేశారు. ఇందులో శ్రీ వేంకటేశ్వర చారిటబుల్ ట్రస్ట్, చైర్మన్, తమ్మినేని బాబు, శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం కార్యదర్శి, ఎస్ వెంకట్రామన్, జాయింట్ సెక్రటరీ హెచ్ అనంత రామన్, వెంకట శేషయ్య, పలువురు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. శిబిరానికి వచ్చిన వారందరికీ ఆహార ఏర్పాట్లను చేశారు.